ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం ఏ ఒక్కవైపు నుంచి కూడా జరగనందున ప్రతీకార దాడి అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడులను తిప్పికొట్టేందుకు భారత బలగాలు కూడా సిద్ధంగా ఉండగా, పాకిస్థాన్ ఎపుడెపుడు దాడులకు పాల్పడదామా అనే ధోరణితో ముందుకు సాగుతోంది.
ముఖ్యంగా భారత సర్జికల్ దాడులను పాక్ సైన్యం, ఉగ్ర ముఠాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ పత్రీకార దాడి కొద్దిరోజుల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క శుక్రవారం ఒక్కరోజే మూడు చోట్ల ఉగ్రవాదుల చొరబాట్లను సైన్యం నిలువరించింది.
ఇదిలావుండగా, ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో దేశంలో తాజ్‌మహల్ లాంటి పర్యటక ప్రాధాన్యం ఉన్న కట్టడాలు అన్నింటికీ భదత్రను భారీగా పెంచారు. తాజ్‌మహల్ వద్ద ఏకంగా 36 మంది కమాండోలను ప్రత్యేకంగా మోహరించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో పెద్ద నగరాలన్నింటిలోనూ భద్రతను పెంచారు.