జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించడంతో పాటు నిర్మించిన సినిమా 'కింగ్స్టన్'. ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలపై రూపొందింది. ఇండియాలో ఫస్ట్ సి అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. ఇందులో దివ్యభారతి హీరోయిన్. 'బ్యాచిలర్' తర్వాత జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఆవిడ మరోసారి నటించారు. శుక్రవారం సినిమా విడుదల అవుతున్న సందర్భంగా ఆమె పలు విషయాలు తెలిపారు.
'- యాక్షన్ సీన్లు చేసేటప్పుడు నాకు ఎటువంటి గాయాలు కాలేదు. మా యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ యాక్షన్ సీన్స్ కోసం కొంత ప్రిపేర్ అయ్యాను. ఇందులో నేను రోప్ సీన్స్ చేశా. యాక్షన్ సీన్స్ చేయడం ఎంత కష్టం అనేది తెలిసింది. ఇటువంటి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ మరొకటి నాకు వస్తుందో లేదో తెలియదు. ఆల్రెడీ సినిమా చూశా. హ్యాపీగా ఉన్నాను. ఆడియన్స్ ఎప్పుడు సినిమా చూస్తారా? అని ఎగ్జైటెడ్ గా ఉన్నాను.