ఇలాంటి పరిస్థితుల్లో హఫీజ్ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీలు విరాళాలు సేకరించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండర్ ఎక్స్ఛేంజి కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ఎస్ఈసీపీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉగ్రవాది ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్-ఉద్-దవా(జేయూడీ), లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), ఫలాహ్-ఇ-ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉన్న జేయూడీ, లష్కరే తాయిబాతోపాటు మరో రెండు సంస్థలపై నిషేధం విధించింది.