ఈ సందర్భంగా పాక్ మానవహక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మాట్లాడుతూ, ఇస్లామాబాదులో హిందువుల జనాభా క్రమంగా పెరుగుతోందని... దేవాలయాలకు వెళ్లేందుకు హిందువులు ఎక్కడెక్కడకో వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
తాజాగా ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం... రూ. 10 కోట్లను విడుదల చేసిందని చెబుతూ, ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి గత బుధవారం భూమి పూజను కూడా పూర్తిచేశారు.
మరోవైపు, పేదరికంలో మగ్గుతున్న పాకిస్థాన్‌ను కరోనా వైరస్ మరింతగా దిగజార్చింది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా హిందూ దేవాలయానికి ఆ దేశం నిధులు మంజూరు చేయడం గమనార్హం.