పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో ఆ యువకుడిని, మహిళను దండించాల్సిన గ్రామపెద్దలు.. యువకుడి సోదరిని శిక్షిస్తూ తీర్పునిచ్చింది. సోదరుడు చేసిన తప్పుకు 14 ఏళ్ల యవసున్న అతని చెల్లెని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పింది.
కాగా, ఉగ్రవాదానికి, అరాచకానికి అడ్డాగా మారిన పాకిస్థాన్ దేశంలో గిరిజన చట్టాలకు సమాంతరంగా నడిచే గ్రామీణ చట్టాలు అమలవుతున్న విషయం తెల్సిందే. ఫలితంగా ‘పరువు’ పేరుతో ప్రతి ఏడాది వందలాది మంది మహిళల ప్రాణాలను ఈ చట్టాలు తీసేస్తున్నాయి.