కరాచీలో మార్చి 15న పాకిస్థాన్ దేశంలోని మైనారిటీలైన హిందువులు హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నవాజ్ షరీఫ్, ఇంకా ఇతర నాయకులు హాజరయ్యారు. ఆయన అలా ఆశీనులై సంబరాలను చూస్తూ వున్నారు. ఇంతలో నరోదా మాలిని అనే బాలిక గాయత్రి మంత్రాన్ని ఆలపించింది. ఈ మంత్రాన్ని ప్రధాని షరీఫ్ ఆసక్తిగా ఆలకించారు. ఆమె పాట పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టి అభినందించారు. చూడండి ఈ వీడియోను యూ ట్యూబ్ నుంచి...