దుబాయ్‌లోకి పాకిస్థాన్ భారీగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తోందని ఎమిరేట్స్ అత్యున్నత భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఫలితంగా పాకిస్థాన్‌తో గల్ఫ్‌కు పెను ప్రమాదం పొంది వుందని ఎమిరేట్స్ భద్రతాధికారి తెలిపారు. భారీగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గల్ఫ్ కమ్యూనిటీకి పెను ప్రమాదంగా మారే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దుబాయ్‌లో భద్రతాధికారులు పలు డ్రగ్స్ రాకెట్ ముఠాలను అదుపులోకి తీసుకోగా.. ఆ ముఠాల్లో అత్యధిక శాతం పాకిస్థాన్‌కు చెందినవే కావడంతో ఎమిరేట్స్ భద్రతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జనరల్ సెక్యూరిటీ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారతీయులు చాలా క్రమశిక్షణతో ఉంటారని, కానీ పాకిస్థానీల వల్ల దేశం ప్రమాదంలో పడిందని లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నారు. ఉద్యోగాల పేరిట గల్ఫ్ దేశానికి వచ్చే పాకిస్థానీయులు.. నేరాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.