దేవుడు చెప్పాడనీ భార్యాపిల్లలను చంపేసిన భర్త.. ఎక్కడ?

సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:24 IST)
అతనికి దేవుడు భక్తి ఎక్కువ. కలలో దేవుడు కనిపించి భార్యాపిల్లలను చంపేయాలని చెప్పాడట. మరుసటి రోజు దేవుడు చెప్పినట్టుగానే భార్యాపిల్లలను చంపేశాడు. ఈ దారుణం అమెరికాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని ఆరిజోనాకు చెందిన ఆస్టిన్ స్మిత్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు.. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ. నిత్యం పూజలు చేస్తుంటాడు. దీనికితోడు చాదస్తం కాస్త ఎక్కువ. 
 
ఒక రోజు ఆయనకు దేవుడు కలలో కనిపించి.. "నీ భార్య మంచిది కాదు.. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమెను చంపేయాలని" చెప్పాడట. అంతే.. మరుసటి రోజు ఉదయం తీవ్ర ఉద్వేగానికిలోనై తన భార్యని ఎందుకలా చేశావ్ అని గట్టిగా రోదిస్తూ షూట్ చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా పిల్లల్ని చంపేశాడు. ప్రియుడి గురించి వెతుకుతూ రోడెక్కాడు. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు