కాక్‌పిట్‌లో స్మోక్ చేసిన పైలట్.. అందుకే ఆ విమానం కూలిపోయింది..?

సోమవారం, 28 జనవరి 2019 (11:09 IST)
నేపాల్‌లో ల్యాండింగ్ అయ్యే సమయంలో యూఎస్-బంగ్లా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది మార్చిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విమానం ప్రమాదానికి గురయ్యేందుకు అసలు కారణం ఏమిటో అధికారులు ఆదివారం వెల్లడించారు. యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్ బాంబర్‌డైయర్ యూబీజీ-211 క్రాష్ ఎలా జరిగిందంటే.. కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ కాల్చడంతోనేనని అధికారులు తెలిపారు. 
 
కాక్‌పిట్‌లో స్మోక్ చేయకూడదనే షరతు వున్నా.. పైలట్ స్మోక్ చేయడంతో ఈ ఘటన జరిగిందని తేలింది. ఈ ప్రమాదంపై జరిగిన దర్యాప్తులో టొబాకో వినియోగించిన కారణంగా విమానం కూలినట్లు అధికారులు నిర్ధారించారు. కాక్ పిట్ వాయిస్ రికార్డర్ డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడి అయినట్లు తెలిసింది. మార్చి 12, 2018లో యూఎస్ బంగ్లా ఎయిర్‌లైన్స్ ప్రమాదానికి గురైంది. రన్‌వేకు 442 మీటర్ల ఎత్తులో ఈ విమానం ప్రమాదానికి గురైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు