ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (15:58 IST)
ఉగ్రవాదులకు, వారికి అండగా నిలిచేవారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారంతా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్స్‌తో ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మరోమారు ఉగ్రవాదంపై తమ వాదనను బలంగా వినిపించారు. 
 
ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు. దీనిని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచేవారిపై కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు మేం పూర్తిగా కట్టుబడివున్నాం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టచం చేశారు. భారత్, అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై2 ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 
 
16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ? 
 
హైదరాబాద్ నగరంలో దారుణం ఘటన ఒకటి చోటుచేసుకుంది. 16 యేళ్ళ మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారానికి పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువతి పెట్టే వేధింపులను భరించలేని ఆ బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జూబ్లీహిల్స్‌లోని నివాసం ఉండే 28 యేళ్ళ ఓ మహిళ తన ఇంటి పక్కనే ఉండే 16 యేళ్ల బాలుడుతో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తన ఇంటికి పిలిచి ఆ బాలుడుకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంది. ఇలా పలుమార్లు తన ఇంట్లోనే ఆ మైనర్ బాలుడుపై లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం బయటకు చెపితే తనపైనే అత్యాచారం చేశావని చెబుతానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. 
 
అయితే, ఆ మహిళ నుంచి వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో ఆ బాలుడు భరించలేకపోయాడు. పైగా, అసభ్యకరమైన పనులు చేయాలంటూ ఒత్తిడి చేయసాగింది. దీంతో వీటిని భరించలేని ఆ బాలుడు... తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు