మొరాకోలో భారీ భూకంపం.. 296మంది మృతి.. మోదీ సాయం

శనివారం, 9 సెప్టెంబరు 2023 (09:55 IST)
Moracco
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భయంకరమైన భూకంపం సంభవించింది. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 296 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో, భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ పేజీలో, "మొరాకోలో భూకంపం కారణంగా చాలామంది మరణించారనే వార్త వినడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో, నా జ్ఞాపకాలన్నీ మొరాకో ప్రజలతో ఉన్నాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో, సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది " అని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు