ప్రధాని మోదీకి కాల్ చేసిన జో బైడెన్.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:51 IST)
అమెరికా ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకరకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు పలికారు. కానీ ట్రంప్ ఘోరంగా ఓడిపోయి బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్ష్యుడు జొ బైడెన్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. 
 
మోదీతో బైడెన్ మాట్లాడడం ఇదే తొలిసారి. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతల మీద చర్చ జరిగినట్టు చెబుతున్నారు. వాతావరణ మార్పుల మీద ఇరు దేశాల మధ్య ఉన్న సహకారం అలానే కొనసాగించాలని చర్చలలో నిర్ణయం తీసుకున్నారు.
 
ఇక వెంటనే మోదీ జో బైడెన్ దంపతులను భారత పర్యటనకు మోదీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని మోదీ బైడెన్‌కు తెలిపారు. ఇక ఈ అంశాలను మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు