ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించిన 12 రోజులకు చేరుకుంది. ఈ 12 రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనకల బలగాలు బాంబులతో పాటు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఉక్రెయిన్‌లో అపారమైన ఆస్తుల నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, కీలక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అణు విద్యుత్ కేంద్రాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఎయిర్ పోర్టులను పూర్తిగా ధ్వంసం చేస్తుంది.
ఇదిలావుంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీతో ఫోనులో మాట్లాడనున్నారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ ఆయన మాట్లాడనున్నారు.
విన్నిట్సియా ఎయిర్‌పోర్టు ధ్వంసం
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా భీకర పోరు సాగిస్తుంది. ముఖ్యంగా, ఉక్రెయిన్ దేశంలోని ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా ఈ యుద్ధం సాగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లోని అనేక ప్రైవేటు, ప్రభుత్వ భవనాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన విన్నిట్సియాపై బాంబుల వర్షం కురిపించింది.
రష్యా నుంచి తమ దేశాన్ని రక్షించేందుకు ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ప్రకటించాలని ప్రతి రోజూ అభ్యర్థిస్తున్నామని, ఒకవేళ అలా ప్రకటించే ధైర్యం లేకుంటే కనీసం ఆయుధాలైనా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.