ఇండోనేషియాలో భూకంపం- జనం పరుగులు

మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:13 IST)
ఇండోనేషియాలో భూకంపం చోటుచేసుకుంది. బాలి, లాంబాక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో తెల్లవారుజామున 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంపంతో ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇండోనేషియా, యుఎస్ జియోలాజికల్ ఏజెన్సీలు సునామీ ముప్పు లేదని పేర్కొన్నాయి. 
 
ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ప్రకారం, బాలి, లాంబాక్‌లోని తీర ప్రాంతాలలో తెల్లవారుజామున నాలుగు గంటలకు భూకంపం సంభవించింది. దాని తర్వాత 6.1, 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. 
 
బాలిలోని పర్యాటకులు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు అనుభవించిన తర్వాత వారి గదుల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఆస్తి నష్టంపై సమాచారం లేదని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు