నార్వేలో బాహుబలి.. శుభాకాంక్షలు తెలిపిన రేణూ దేశాయ్

సోమవారం, 21 ఆగస్టు 2023 (13:16 IST)
బాహుబలి సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఇటీవలే నార్వేలో జరిగింది. నార్వేలోని స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన స్క్రీనింగ్‌కు రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బాహుబలి చిత్ర బృందంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
స్టావెంజర్‌‌ ఒపేరా హౌస్‌లో జరిగిన స్క్రీనింగ్‌కు హాజరైన రేణు దేశాయ్.. సోషల్ మీడియా వేదికగా బాహుబలి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రేణు.. ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. స్టావెంజర్‌‌లో సినిమా చూసేందుకు నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోభు గారికి థ్యాంక్స్ అంటూ రేణూ దేశాయ్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు