కరోనా మహమ్మారి ఎందరో అమాయికుతో పాటు... అనేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులను పొట్టనబెట్టుకుంటుంది. ఈ వైరస్ బారినపడి తిరిగి కోలుకోలేక వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత చెఫ్ చనిపోయారు. తాజాగా సౌతాఫ్రికాలో భారత సంతతి శాస్త్రవేత్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈమె పేరు గీతా రాంజీ. ప్రముఖ వైరాలజీ శాస్త్రవేత్త.
ఆమెలో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఆమె మృతి పట్ల సౌతాఫ్రికా మెడికల్ రీసర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈవో గ్లెండా గ్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 2018లో యూరోపియన్ డెవలప్మెంట్ క్లినికల్ ట్రయల్స్ పార్ట్‌నర్‌షిప్ ఆమెకు ఔట్ స్టాండింగ్ ఫిమేల్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు.