కాగా, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన యరిత్జా, ఇండోనేసియాకు చెందిన నటాషా రన్నరప్‌లుగా నిలిచారు. గతేడాది ప్రపంచసుందరిగా నిలిచిన స్పెయిన్ భామ మిరియా లాలాగుణ విజేతకు కిరీటాన్ని అందజేసింది. ఫైనల్‌కు పోటీ పడిన ఐదుగురిలో కెన్యా, ఫిలీప్పీన్స్ భామలు కూడా ఉన్నారు. విజేతగా నిలిచిన డెల్ వాల్లే తాను వినోద రంగంలోకి రావాలనుకుంటన్నట్లు వెల్లడించింది.