ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ఒరిగిందేమీ లేదు.. చెప్పిందెవరంటే?

గురువారం, 24 మార్చి 2022 (16:38 IST)
ఉక్రెయిన్‌పై యుద్ధం చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటిదాకా సాధించిందంటూ ఏమీ లేదని స్వయంగా పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ అంగీకరించడం విశేషం. కానీ సైనిక చర్య ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక మేరకే సాగుతోందన్నారు.
 
మరోవైపు యుద్ధం ద్వారా ఆశించిన మూడు ప్రధాన లక్ష్యాల సాధనలో రష్యా పూర్తిగా విఫలమైందని అమెరికా పేర్కొంది. అనైతిక యుద్ధంతో ప్రపంచం దృష్టిలో రష్యా ప్రతిష్ట పూర్తిగా అడుగంటిందని అమెరికా తెలిపింది. 
 
ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుదేలై దాని అధికారమూ బలహీనపడిందిని రష్యా దూకుడు వల్ల పశ్చిమ దేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఐక్యమయ్యాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సలివన్‌ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు