ఆ పుస్తకం చదవండి.. పాక్ యువతకు ఇమ్రాన్ పిలుపు

సోమవారం, 5 అక్టోబరు 2020 (06:26 IST)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో యువతకు ఓ సలహా ఇచ్చారు. ఎలిఫ్ షఫక్ రాసిన ‘ది ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని అక్టోబరు నెలలో యువతకు సూచిస్తున్నానని తెలిపారు.

ఇది దైవ ప్రేమ, సూఫిజం గురించి స్ఫూర్తిదాయకమైన పుస్తకమని పేర్కొన్నారు. కొన్నేళ్ళ క్రితం తాను ఈ పుస్తకాన్ని చదివినట్లు, గాఢమైన స్ఫూర్తి పొందినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకం ఫొటోను కూడా ఆయన జత చేశారు. 
 
ఇమ్రాన్ ఖాన్ మే నెలలో ‘లాస్ట్ ఇస్లామిక్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని యువతకు సూచించారు. అష్ట దిగ్బంధనం రోజుల్లో చదవడానికి యువతకు ఇది చాలా గొప్ప పుస్తకమని పేర్కొన్నారు.

ఇస్లామిక్ నాగరికత మహోన్నతంగా వెలగడం నుంచి క్షీణత వరకు ఈ పుస్తకంలో వివరించారని, వీటి వెనుకనున్న కారణాలను కూడా తెలిపారని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు