ఇందుకుగాను ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు కొలామి వాచకం, గోండి వాచకం, బంజార వాచకం, కోయ వాచకాలను ఈ విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ వాచకం ద్వారా ఒకటో తరగతిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాలను ఒకటవ పాఠంలో పునశ్చరణ చేసి, తక్కిన పాఠాల్లో విద్యార్థి పఠన, లేఖన, శ్రవణ నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన గిరిజన ఇతివృత్తాలు ఎంచుకొని ఆసక్తికరంగా తయారుచేశారు.
2019-20లో ప్రయోగాత్మకంగా బంజారా, గొండి, కోయ, కొలామి భాషల్లో చిన్న పదాలతో పుస్తకాలను రూపొందించి ఆయా పాఠ్య పుస్తకాలతోపాటు తమ భాషకు సంబంధించిన పదాలను నేర్చుకునేలా దృష్టి పెట్టారు.