ఈ మధ్య గుట్టుగా సాగాల్సిన వ్యవహారాలు రోడ్డెక్కేస్తుంటే, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా నడి రోడ్డులో.. అదీ రద్దీ ట్రాఫిక్‌లో.. చూడకూడని ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యేసరికి వాహనదారులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ ఘటనని చూసి ఇదేమిటని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ వింత ఘటన జకార్తాలోని ఓ రద్దీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ ప్రకటన తెరపై అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు పరుగులు పెట్టారు.