భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అమెరికా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఇది బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. ముఖ్యంగా, అమెరికాలో ఈ బియ్యం కొరత ఏర్పడటంతో డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది.
ఇప్పటికే బియ్యం బస్తాలను జనాలు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న ఊహగానాల నడుమ రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతీ బియ్యం కొనుగోళ్లు పెంచినట్టు సమాచారం.