బ్రిటన్ రాజు ఆస్తుల కంటే అక్షత మూర్తి ఆస్తులే ఎక్కువ!!

బుధవారం, 26 అక్టోబరు 2022 (13:18 IST)
బ్రిటన్ దేశ కొత్త ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన భార్య అక్షత మూర్తి పేరు మరోమారు వార్తలకెక్కింది. ఈ ఇద్దరూ మల్టీ మిలియనీర్లే. అయితే, బ్రిటన్ రాజు-2, దివంగత రాణితో పోల్చుకుంటే అక్షత మూర్తి ఆస్తులే అధికంగా ఉన్నాయనే ప్రచారం బ్రిటన్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. బ్రిటన్ రాణి ఆస్తుల విలువ రూ.3400 కోట్లు కాగా, అక్షత మూర్తి ఆస్తుల విలువ రూ.4200 కోట్లుగా ఉన్నాయన్నాట. 
 
దీనికి కారణం లేకపోలేదు. అక్షత మూర్తి తండ్రి భారత టెక్ దిగ్గజం కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. పైగా, అక్షతకు ఇన్ఫోసిస్ కంపెనీలో 3.89 కోట్ల షేర్ వాటా వుంది. మొత్తం షేర్లలో ఇది 0.98 శాతం. అయితే, కంపెనీలో అక్షిత వాటా విలువ దాదాపు 6 వేల కోట్లకు పైగాగానే ఉంది. 
 
ఇటీవలే ఇన్ఫోసిస్ నుంచి డివిడెండ్ రూపంలో అక్షత రూ.126 కోట్లను అందుకున్నారు. దీంతో పాటు ఆమెకు అక్షత డిజైన్స్ పేరుతో దుస్తుల తయారీ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. వీటిన్నింటి విలువను మదింపు చేస్తే క్వీన్ ఎలిజిబెత్ ఆస్తుల కంటే అక్షత ఆస్తులు ఎక్కువేనట. 
 
మరోవైపు, బ్రిటన్ పార్లమెంటేరియన్‌లో అత్యంత ధనవంతుడు రిషి సునక్. ఇపుడు ఈ దంపతులిద్దరి ఆస్తులు కలిస్తే మొత్తం విలువ రూ.7 వేల కోట్లకు పైనే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. వీరిద్దరి ఆస్తులు ప్రస్తుత బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే ఎక్కువేనట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు