న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్ రెండోసారి అల్లాడిపోతోంది. ప్రతి రోజు లక్షలాది కేసులు కొత్తగా వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మెడికల్ ఆక్సిజన్, యాంటీవైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా స్పందించింది. భారత్‌కు ఈ రెండింటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. వచ్చే 15 రోజుల్లోనే వాటిని పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.
వారానికి 3,00,000- 4,00,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, అలాగే నౌక ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని రష్యా ముందుకొచ్చినట్టు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. దేశంలో రెమ్‌డెసివిర్ డ్రగ్స్‌కు కొరత ఏర్పడడంతో భారత ప్రభుత్వం వాటి ఎగుమతులను ఇటీవల నిషేధించింది. అంతేకాక, దిగుమతి సుంకాలను రద్దు చేసింది.