విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి? బొత్తిగా అర్ధమే కావడం లేదు కదూ...!!. వివరాల్లోకి వెళ్తే.... ఇనుమును తయారు చేసే క్రమంలో భూమిలో దొరికే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్(Fe2O3)ను స్టీల్‌గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్‌లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది.
వాతావరణం లోని గాలిలో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. Air compressor ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వారా మలినాలు వేరు చేసి జియోలైట్ బెడ్‌తో నింపబడిన PSA generator ద్వారా నైట్రొజన్‌ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు. ఇలా పలుమార్లు శుధ్ధీకరించబడిన ఆక్సిజన్‌ను మెడికల్ ఆక్సిజన్‌గా సిలిండర్లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట.