రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు పుతిన్

శుక్రవారం, 26 మార్చి 2021 (20:17 IST)
2036 వరకు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షపదవిని చేపట్టనున్నారు. అధ్యక్షుడిగా పుతిన్‌ మరో రెండు దఫాలు కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లుకు ఆ దేశ దిగువసభ (స్టేట్‌ డ్యూమా) ఆమోదం తెలిపింది.

దీంతో 2024 నుంచి రెండు దఫాలు (2036 వరకు) ఆయనే అధ్యక్షుడిగా కొనసాగే ప్రక్రియలో మరో ముందడుగు పడినట్లైంది. ఈ బిల్లును రష్యా ఎగువసభ (ఫెడరేషన్‌ కౌన్సిల్‌) ఆమోదించాల్సి ఉంది.  అనంతరం అధ్యక్షుడి సంతకంతో అది చట్టంగా రూపుదాల్చుతుంది.

పుతిన్‌కు ప్రస్తుతమున్న ఆరేళ్ల పదవీకాలం 2024తో ముగియనుంది. కాగా,  దేశాధ్యక్ష పీఠంపై ఆయన 2036 వరకు కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలను రష్యా ప్రజలు 2020 జులైలో ఆమోదించారు. దాని ప్రకారం పుతిన్‌ గతంలో నాలుగుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన లెక్క పరిగణనలోకి రాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు