ఉక్రెయిన్‌‌కు మద్దతిస్తాం కానీ ఆ దేశం తరపున రష్యాతో పోరాటం చేయం: బైడెన్

బుధవారం, 2 మార్చి 2022 (18:36 IST)
అమెరికా అధ్యక్షుడు  జో-బైడెన్ ఉక్రెయిన్‌కు తమ పూర్తి మద్దతు వుంటుందని పునరుద్ఘాటించారు. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తరపున ఆ దేశ భూభాగంపై రష్యాతో తలపడబోమని చెప్పారు. తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో దేశ భూభాగాలను రక్షిస్తుందని ఆయన చెప్పారు. 
 
అమెరికాతో పాటు మిత్ర దేశాల భూభాగంలోని ప్రతి అంగుళాన్ని సమిష్టి శక్తితో రక్షిస్తుందని పేర్కొన్నారు. ఉక్రేనియన్లు గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని కొనియాడారు. పుతిన్ యుద్ధభూమిలో లాభాలు పొందవచ్చు, కానీ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
 
తమ దళాలు పోలాండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా సహా నాటో దేశాలను రక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోవని స్పష్టం చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు