కాగా, రష్యా - భారత్ దేశాల మధ్య ఏర్పడిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా రూ.వందల కోట్ల విలువైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాకు అమెరికా రూపంలో అడ్డంకులు తగులుతున్నాయి.
ఈ అత్యాధునిక మిసైల్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనేందుకు గతంలోనే ఇండియా డీల్ కుదుర్చుకోగా, తాజాగా విడుదలైన యూఎస్ కాంగ్రెస్ రిపోర్టు, ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.
మరింత సాంకేతికతను అందుకోవాలన్న ప్రయత్నాలు కూడదని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని మరింతగా పెంచాలని, రక్షణ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది.
"రష్యా తయారు చేసుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మేము వ్యతిరేకం. వీటిని ఇండియా కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల చట్టానికి ఇండియా - రష్యా డీల్ వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం" అని సీఆర్ఎస్ పేర్కొంది.