నిజానికి సౌదీ మహిళలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే అందుకు భర్త లేదా తండ్రి లేదా సోదరుడు అనుమతిని తీసుకురావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నిబంధనలు ఎత్తివేసింది. మహిళలు ఇకమీదట పురుషుల అనుమతి లేకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రైవేటు రంగంలో మహిళలు రాణించడాన్ని ప్రోత్సహించేందుకు ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు.. సౌదీఅరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ విభాగం తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్‌ను నియమించనుంది. విమానాశ్రయాలు, సరిహద్దుల్లో ఖాళీగా ఉన్న 140 పోస్టుల్లో మహిళలను నియమించుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం 1,07,000 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.