భూమికి పెను ముప్పు.. దూసుకొస్తున్న ఉల్కలు.. 3 అణు బాంబులతో సమానమైన విధ్వంసం!

గురువారం, 13 అక్టోబరు 2016 (08:26 IST)
భూమికి పెను ముప్పు పొంచివున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం.. భూమివైపు వెయ్యి ఉల్కలు (ఆస్ట్రాయిడ్స్) వేగంగా దూసుకొస్తున్నట్టు వెల్లడించారు. వీటివల్ల ప్రపంచం అంతరించి పోతుందని వారు అంటున్నారు. 
 
నిజానికి 2012లో ప్రపంచం అంతరించిపోతుందని చాలా ప్రచారం జరిగింది. అలా జరగకపోవడంతో ఇలాంటి వాటిని ప్రజలు నమ్మడం లేదు. అయితే ఇపుడు నిజంగానే భూమికి పెను ముప్పు పొంచి ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు వెయ్యి ఉల్కలు భూమి వైపు అతి వేగంగా దూసుకొస్తున్నట్లు గుర్తించారు.
 
గంటకు 60 వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆస్ట్రాయిడ్లతో ప్రపంచ వినాశనం తప్పదని అంచనా వేస్తున్నారు. 2009 ఈఎస్ అనే పేరు గల ఉల్క అతి త్వరలోనే భూమిని ఢీకొట్టవచ్చని చైనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు. 10 మైళ్ళ వెడల్పు ఉన్న ఈ అతి పెద్ద ఆస్ట్రాయిడ్ మూడు బిలియన్ అణు బాంబులతో సమానమైన విధ్వంసం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో భూమిపైనున్న మూడో వంతు జీవరాశి నాశనమవుతుందని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి