ఇక ఇదిలా ఉంటే, జపాన్ సముద్ర తీరంలో 39,910 టన్నుల బరువైన ఓ భారీ రవాణా షిప్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం తరువాత ఆ షిప్‌లోని ఆయిల్ కొంతమేర లీక్ అయింది. వెంటనే జపాన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రంగంలోకి దిగి షిప్ నుంచి ఆయిల్ కాకుండా సరిచేశారు.
అయితే, భారీ కలప లోడ్ తీసుకొని వెళ్తున్న ఈ షిప్ ప్రతికూల వాతావరణం కారణంగా విరిగిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జపాన్ ప్రభుత్వం పేర్కొన్నది.