డోక్ లా నుంచి కదిలేది లేదన్న భారత్.. దిక్కుతోచని చైనా

ఆదివారం, 9 జులై 2017 (16:26 IST)
డ్రాగన్ కంట్రీకి హెచ్చరికలకు తాము లొంగే రకం కాదని.. భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దులో శాంతి నెలకొనాలంటే డోక్లాం నుంచి భారత్ భేషరతుగా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించాలని చైనా హెచ్చరించింది. 
 
అయితే ఈ వాఖ్యలను భారత సైన్యం పట్టించుకోలేదు. ఇండియన్ ఆర్మీ అక్కడే టెంట్లు వేసుకుని సుదీర్ఘంగా అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తద్వారా తాము దేనికైనా సిద్ధమనే సంకేతాన్ని ఇండియన్ ఆర్మీ చైనాకు పంపింది. కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి వెళ్లే సమస్యే లేదని భారత్ తేల్చి చెప్పింది. 
 
మరోవైపు చైనా మాత్రం తాము వెనక్కి తగ్గబోమని, రాజీ పడే ప్రసక్తే లేదని అంటోంది. భారత్‌లో పర్యటించే తమ దేశీయులు అప్రమత్తంగా ఉండాలంటూ చైనా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగత భద్రత, స్థానిక భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేసుకుని అప్రమత్తత పాటించాలని సూచించింది.

వెబ్దునియా పై చదవండి