వారితోపాటు మరికొందరు కూడా విమానం నుంచి కిందికి దిగిపోయారు. కొందరు మాత్రం విమానంలోనే ఉండి పాముల్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఒక పాము అయిదడుగుల పొడవు ఉందని, అది ఏ జాతికి చెందినదో తెలియలేదని ఓ ప్రయాణీకుడు తెలిపాడు. అసలు విమానంలోకి పాములు ఎలా వచ్చాయనే దానిపై సదరు విమానయాన సంస్థ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.