ఆఫ్రికా ఖండంలో అత్యంత పేద, కల్లోలభరిత దేశంగా గుర్తింపు పొందిన సోమాలియాలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఓ హోటల్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యలమంటూ అల్ షబాబ్ ప్రకటించింది.
సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బిచ్‌కు సమీపంలో ఉన్న ఈ హోటల్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిడా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరపడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.