South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదం.. 179మంది సజీవదహనం

సెల్వి

ఆదివారం, 29 డిశెంబరు 2024 (10:58 IST)
Plane Crash
దక్షిణ కొరియాలోని ఒక విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం మంటల్లో చిక్కుకుని 85 మంది మరణించారని దక్షిణ కొరియా అగ్నిమాపక సంస్థ తెలిపింది. 181 మందితో ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయిన వెంటనే రన్‌వేపై జారి ఢీకొంది. 
 
ఈ సంఘటన సమయంలో 175 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 179 మంది మరణించినట్టు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 
 
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన 7సి2216 బోయింగ్ 737-800 విమానం దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపుతప్పింది. 
 
విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొని కాలిబూడిదైంది. విమానం ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు