వాషింగ్టన్: ఆమె ఒకప్పుడు మోడల్... కానీ, ఇపుడు అమెరికన్ ఫస్ట్ లేడీ. డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా. ట్రంప్‌తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నపుడే మెలనియా బోల్డ్‌నెస్ అందరినీ ఆకట్టుకుంది. అసలు ఆమె ఎవరు... బ్యాక్‌గ్రౌండ్ ఏంటి...అనే ఉత్సుకత అందరిలోనూ కలిగింది. ట్రంప్ గెలిచి మెలానియా ఫస్ట్ లేడీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమెపై అందరికీ అమితాసక్తి మొదలైంది.
ట్రంప్ ఆమెను 1998లో ఒక ఫ్యాషన్ పార్టీలో కలిశాడు. అపుడు డోనాల్డ్ వేరే అమ్మాయితో ఉన్నాడు. మెలానియాను ఒంటరిగా కలవాలని నెంబర్ కూడా ఇచ్చాడు. డోనాల్డ్ ట్రంప్ ఆమెకన్నా 24 ఏళ్ళు పెద్ద. మెలానియా 1970 ఏప్రిల్ 26న పుట్టింది. డోనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946లో పుట్టారు. వీరిద్దరూ యాదృచ్ఛికంగా ఒక ఫ్యాషన్ షోలో కలసి ఏడేళ్ళు ప్రేమాయణం సాగించారు. 2005లో ఇద్దరూ పెళ్ళాడారు.
అసలు మెలానియా యుగస్లోవియా నుంచి వచ్చి తన కెరీర్ ప్రారంభించింది. స్టేన్ జెర్కో అనే ప్రముఖ ఫోటోగ్రాఫర్ ద్వారా 17 ఏళ్ళకు మెలానియా మోడలింగ్ లోకి వచ్చింది. 18 ఏళ్ళకు మిలన్ ఏజెన్సీతో వ్యాపార ఒప్పొందాన్ని చేసుకుని ప్యారిస్‌లో మోడలింగ్ వర్క్ మొదలు పెట్టింది. చాలా ఫ్యాషన్ షోలు చేసినా, బ్రిటిష్ జి-క్యూ మాగ్జైన్‌లో నగ్నంగా ఫోజులిచ్చి... ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది.
బాండ్ గాల్‌గా ఆమె ఇచ్చిన మోడలింగ్ ఫోటో ఇప్పటికీ అందరినీ ఆకర్షిస్తోంది. బోల్డ్‌గా మ్యాగ్‌జైన్‌లకు ఫోజులివ్వడమే కాదు... ఘాటుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంలోనూ మెలానియా ముందుండేది. నేను, ట్రంప్ ఇద్దరం కలిసి రోజూ సెక్స్‌లో బాగా ఎంజాయ్ చేస్తాం... రోజుకు ఒకసారి కంపల్సరీ... ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ... అంటూ సంసారిక జీవితం పైనా విడమరిచి చెప్పే బోల్డ్‌నెస్ ఆమెది. చాలామంది ఆడవాళ్లు చేసే తప్పు ఒక్కటే, పెళ్ళయ్యాక మొగుడిని మార్చాలని అనుకుంటారు.
కానీ, ఎవరి ఇష్టాయిష్టాలు వారికుంటాయని నాకు తెలుసు. అలా మసలకుంటూ మేం చాలా హ్యాపీగా ఉన్నాం అంటుంది మెలానియా.అవును మరి ఇలా బోల్డ్‌గా మాట్లాడుతుంది కాబట్టే... మన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ ఫస్ట్ లేడీ తెగ నచ్చేసినట్లుంది. పదేపదే ఈ హాట్ లేడీ గురించి ట్వీట్ చేస్తున్నాడు రామ్.