డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. క్యాపిటల్ భవనంపై దాడి కేసులో అనర్హత వేటు నుంచి విముక్తి

ఠాగూర్

మంగళవారం, 5 మార్చి 2024 (10:44 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది. గత 2021లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ భవనంపై ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిని ట్రంప్ ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కొలరాడోలే జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గత యేడాది ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ అనర్హతను అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని  సెక్షన్ 3 ప్రకారం వేటు వేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని, కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.
 
ఈ తీర్పుతో ఒక్క కొలరాడోలోనే కాదు ఇలినోయీ, మైన్‌లో కూడా ట్రంప్ అభ్యర్థిత్వంపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. మాజీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కొలరాడోలో వ్యాజ్యం వేసిన పిటిషనర్లకు మద్దతుగా నిలిచిన సిటిజన్స్ ఫర్ రెస్పాన్సిబులిటీ అండ్ ఎథిక్స్ సంస్థ మాత్రం తీర్పుతో ఏకీభవంచలేదు. క్యాపిటల్ భవన్పై హింసకు ట్రంప్ ప్రేరేపించారని తీర్మానించేందుకు కోర్టుకు అవకాశం లభించింది. దాన్ని వదులుకుంది. అందుకు బదులుగా 14వ సవరణలోని 3వ సెక్షన్‌ను ఉపయోగించే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొంది అని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు