మంగళవారం వేకువజామున 3.30 గంటలకు వైమానిక దాడులు జరగగా సరిగ్గా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న నలియా ఎయిర్‌బేస్‌కు సమీపంలో తిరుగాడుతున్న డ్రోన్‌ను భారత్ గుర్తించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని పేల్చివేసారు. ఈ ఎయిర్‌బేస్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడి నుండి భారత్ దాడులకు దిగుతుందేమో అనే వివరాలను తెలుసుకోవడానికి దీన్ని పంపి ఉండవచ్చని విశ్లేషించారు.
వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలో హైఅలర్ట్ ప్రకటించగా, గుజరాత్‌లో కూడా అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు ఆజ్ఞలు జారీ అయ్యాయి.