కరోనా విజృంభణ : సిడ్నీలో లాక్డౌన్

శనివారం, 17 జులై 2021 (11:28 IST)
ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో మళ్లీ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. గత మూడు వారాలుగా ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్యలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో సిడ్నీలో శనివారం నుంచి లాక్డౌన్ విధించారు. అలాగే అన్ని రకాల వాణిజ్య షాపులు, రిటైల్ షాపులను మూసివేయాల్సిందిగా సిడ్నీ నగర అధికారులు ఆదేశించారు. లాక్డౌన్‌ను కఠిన ఆంక్షలతో అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 
 
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కీలక ప్రాంతమైన న్యూ సౌత్ వేల్స్‌లో గత 97 రోజుల తర్వాత భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఇక్కడ ఏకంగా 111 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తక్షణం లాక్డౌన్‌ను అమల్లోకి తెచ్చారు. అలాగే, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా అధికంగానేవుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు