కరోనా వైరస్ వల్ల ఆయన మృతిచెందిన ఉంటారని భావిస్తున్నారు. అధ్యక్షుడు జాన్‌కు కరోనా సంక్రమించినట్లు గత వారం ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని ద్రువీకరించలేదు. దేశంలో 14 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. టాంజానియా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు హసన్.. దేశాధ్యక్ష బాధ్యతలు చేపడుతారు.
గత ఏడాది మగుఫులి దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 27వ తేదీన చివరిసారి మగుఫులి పబ్లిక్‌గా కనిపించారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు. ఆయన ఆరోగ్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు జాన్‌కు కరోనా సంక్రమించిందని, ఆయన కెన్యాలో చికిత్స పొందుతున్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేత టుండు లిస్సు ఆరోపించారు. కరోనా వైరస్ అంటూ ఏదీ లేదని గత ఏడాది అధ్యక్షుడు జాన్ మగుఫులి ప్రకటించారు. గత ఏడాది జూన్‌లోనే ఆయన దేశాన్ని కోవిడ్ ఫ్రీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.