ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఐదు రోజుల పాటు ఈ దృశ్యం ఆకాశంలో కనిపించనుంది. పాథియాన్ అనే గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తుంది. దీంతో ఉల్కాపాతాలు సంభవించనున్నాయి. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ దీనిని చూసి ఆస్వాదించవచ్చు.
డిసెంబర్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉల్కలు నేల వైపు దూసుకొస్తాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రమాదమూ జరిగే అవకాశం లేదు.
వీటిని చూసేందుకు ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేదు. నేరుగా చూడవచ్చు. ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లే అవకాశం ఉంది