అగ్రరాజ్యం ఆక్స్‌ఫర్డ్‌లో కాల్పుల మోత : ముగ్గురు విద్యార్థుల మృతి

బుధవారం, 1 డిశెంబరు 2021 (07:50 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు మోత వినిపించింది. ఆ దేశంలోని ప్రతిష్టాత్మక పాఠశాలల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ స్కూల్‌ తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిచిగాన్‌లోని ఓ స్కూల్‌లో 15 యేళ్ళ బాలుడు తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పులు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిదిమంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉండటం గమనార్హం. మృతుల్లో ఇద్దరు బాలురు, ఒక అమ్మాయి ఉన్నారు. 
 
డెట్రాయిట్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ కాల్పుల ఘటన జరిగిందని భద్రతా అధికారి మైక్ మేక్‌కేబ్ వెల్లడించారు. ఈ ఘటన కేవలం ఐదు నిమిషాల్లో జరిగిపోయిందనీ దీనికి సంబంధించి కారణాలు తెలియాల్సి వుందని మైక్ మేక్‌కేబ్ వెల్లడించారు. కాగా, ఈ కాల్పులకు తెగబడిన కేసులో 15 యేళ్ళ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు