పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. దాదాపు ఒక మీటర్ మేరకు మంచు కురిసింది. దీంతో ప్రముఖ హిల్ స్టేషన్‌గా ఉన్న ముర్రీలో పర్యటిస్తున్న పర్యాటకుల్లో అనేక మంది ఈ ముంచు తుఫానులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పది మంది చిన్నారులతో పాటు.. మొత్తం 22 మంది వరకు ఉన్నట్టు పంజాబ్ ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో హిల్ స్టేషన్ ముర్రీని విపత్తు ప్రాంతంగా శనివారం ప్రకటించారు.
ఈ ముంచు తుఫాను కారణంగా ముర్రే రహదారుల్లో వేలాది సంఖ్యలో వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. దాదాపు వెయ్యికి పైగా కార్లు ఈ హిల్ స్టేషనులో చిక్కుకునిపోయాయి. దీంతో అప్రమత్తమైన పంజాప్ ప్రావిన్స్ ప్రభుత్వం సహయక చర్యలను వేగవంతం చేసింది. ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, పరిపాలనా కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
"అపూర్వమైన హిమపాతం, హడావుడి వాతావరణ పిరిస్థితులను తనిఖీ చేయకుండా కొనసాగడం జిల్లా పాలనా యంత్రాంగం సంసిద్ధంగా లేనందున విచారణకు ఆదేశించడం జరిగింది. ఇలాంటి విషాదాల నివారణకు బలమైన నియంత్రణ వ్యవస్థను ఉంచాలని ఆదేశించింది" అని పాక్ ప్రధాని ఓ ట్వీట్‌లో వెల్లడించారు.