భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుల్లోపడ్డారు. అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్‌గా పిలిచే ఎంటర్ బాక్టర్ బుగాన్ డెన్సిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, బహుళ ఔషధాలను నిరోధించ గలిగే శక్తిమంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ-డ్రగ్ రెసిస్టెంట్ కావడంతో దీనిని 'సూపర్ బగ్' అని పిలుస్తుంటారని, శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కాగా ఈ సూపర్ బగ్‌తో ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పాటు మరో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుల్లో పడ్డారు. సునీతా విలియమ్స్ పాటు బారీ యూజీన్ వ్యోమగామి ఇద్దరూ జూన్ 6, 2024న అంతర్జాతీయ అంతరక్ష కేంద్రానికి చేరుకున్నారు. మిగతా ఏడుగురు సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఈ 'స్పేస్ బగ్స్' గ్రహాంతరాలకు సంబంధించినవి కావని, వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు బలంగా భావిస్తున్నారు.
తూర్పు ఆఫ్రికాలోని మలావి ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా ఉన్నారు. అలాగే, మరో తొమ్మిది మంది కూడా ఉన్నారు. ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.17 గంటలకు షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోవాల్సి వుంది. ఆ విమానం ఉదం 10.02 గంటల వరకు కూడా ల్యాండింగ్ కాలేదు. పైగా, రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
రాజధాని నగరం లిలాంగ్వే నుంచి బయలుదేరిన ఈ విమానం రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్టు కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి. కాగా, విమానం కోసం మలావి అన్వేషణ కొనసాగుతోంది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషను అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. కాగా అదృశ్యమైన విమానంలో చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ ఫర్మేషన్ మూవ్మెంట్ (యూటీఎం) పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు.
మూడు రోజుల క్రితం మాజీ క్యాబినెట్ మంత్రి రాల్ఫ్ కసంబర చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా విమానం మిస్సింగ్కు కారణం ఇంకా తెలియరాలేదు.