కొత్త ప్రతిపాదన అంగీకారం పొందితే ఎక్కువ వేతనాలు లభించే, అధిక నైపుణ్యం గల ఉద్యోగులకే పెద్దపీట వేసేలా వీసాల జారీప్రక్రియ ఉండనుంది. తాజా నిబంధన వల్ల ప్రతిభ ఉన్నవారు మాత్రమే అమెరికాకు వచ్చే వీలుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని, స్థానిక అమెరికన్లకు మరింత భద్రత లభిస్తుందని డీహెచ్‌ఎస్ వర్గాలు చెప్పాయి. ప్రతిఏడాది హెచ్1-బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా... కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65 వేల దరఖాస్తులను మాత్రమే ఎంపికచేసి వీసాలు జారీచేస్తుంటారు.
దీని ద్వారా అమెరికా కంపెనీలు చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండడంతో స్థానికులకు అవకాశాలు దక్కడంలేదని ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వీసాల జారీలో భారీ సంస్కరణలు చేపడుతోంది. కాగా, హెచ్1-బీ, ఎల్-1 వీసాల జారీని డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.