ముఖానికి మాస్క్ ధరించడం.. దేశ భక్తిని చాటడమే : డోనాల్డ్ ట్రంప్

మంగళవారం, 21 జులై 2020 (12:26 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి నానాటికీ పెరిగిపోతోంది. ఈ వైరస్ నుంచి బయటడేందుకు ప్రపంచ దేశాలు చేయని పోరాటమంటూ లేదు. అలాగే, ఈ వైరస్ వ్యాప్తి కోసం ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ అనేక ప్రపంచ దేశాలు ఈ వైరస్ బారినపడుతున్నాయి. అలాంటి వాటిలో అమెరికా ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా అమెరికా రికార్డు సాధించింది. 
 
అయితే, ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే, తాను మాత్రం మాస్క్ ధరించబోనని, కరోనా వైరస్ తనను ఏం చేయదంటూ డోనాల్డ్ ట్రంప్ బీరాలు పలికారు. 
 
ఆ త‌ర్వాత కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో ట్రంప్ కూడా మాస్క్‌ను ధ‌రించారు. ఇక ఇప్పుడు ఓ ట్వీట్ కూడా చేశారు. క‌నిపించ‌ని చైనా వైర‌స్‌ను ఓడించేందుకు మ‌నం అంద‌రం ఐక్యంగా పోరాడాల‌న్నారు. 
 
సోష‌ల్ డిస్టాన్స్ పాటించ‌డం వీలుకాని స‌మ‌యంలో.. ముఖానికి మాస్క్ ధ‌రించ‌డం దేశ‌భ‌క్తిని చాటడ‌‌మే అని కొంద‌రంటున్నార‌ని ట్రంప్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. మాస్క్ పెట్టుకుని దిగిన ఓ ఫోటోను త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు. నా క‌న్నా గొప్ప దేశ‌భ‌క్తుడు ఎవ‌రూ ఉండ‌ర‌ని, నేను మీ ఫెవ‌రేట్ అధ్య‌క్షుడిన‌ని ట్రంప్ ఆ ట్వీట్‌లో తెలిపారు.

 

We are United in our effort to defeat the Invisible China Virus, and many people say that it is Patriotic to wear a face mask when you can’t socially distance. There is nobody more Patriotic than me, your favorite President! pic.twitter.com/iQOd1whktN

— Donald J. Trump (@realDonaldTrump) July 20, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు