కరోనా కేసులు ఎక్కువగా వుండటాన్ని గౌరవంగా భావిస్తున్నా: ట్రంప్

గురువారం, 21 మే 2020 (22:08 IST)
అమెరికాలో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉండటం తాను గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు భారీగా చేస్తుండటం వలనే ఇలా కోవిడ్ కేసులు పెద్ద ఎత్తున బయట పడుతున్నాయని చెప్పారు.
 
పరీక్షల విషయంలో మేము అప్రమత్తంగా ఉన్నామని ఈ కేసుల సంఖ్య సుచిస్తోందన్నారు. ఇది నేను చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యలను డెమోక్రటిక్ నేషనల్ కమిటీ తోసిపుచ్చింది. 
 
నాయకత్వ వైఫల్యం కారణంగానే దేశంలో కోవిడ్ విజృంభిస్తోందని పేర్కొంది. కోవిడ్ బారిన పడకుండా ప్రతిరోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. ఈ మందు ఒక రక్షణ రేఖ లాంటిదని అభివర్ణించారు. దీనికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలను ట్రంప్ తప్పుబట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు