డొనాల్డ్ ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన మహిళా న్యాయమూర్తి.. ఆంక్షల్ని నిలిపేసింది..

ఆదివారం, 29 జనవరి 2017 (13:14 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించి ఆంక్షలను మహిళా న్యాయమూర్తి ఎన్ డొనెల్లీ తాత్కాలికంగా ఆపివేశారు. అమెరికాలో న్యాయవ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో మల్టీబిలియనీర్‌ అధ్యక్షుడికి తెలియజెప్పారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల వారు అమెరికా రాకుండా దేశాధ్యక్షుడు ట్రంప్‌ విధించిన ఆంక్షలను ఎన్‌ డొనెల్లీ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో తనదైన శైలిలో విధానాలను అవలంబిస్తున్న ట్రంప్‌కు తొలిసారిగా ఆమె ఝలక్‌ ఇచ్చినట్లయింది. 
 
మిచిగాన్‌లోని రాయల్‌ఓక్‌ ప్రాంతానికి చెందిన ఎన్‌ డొనెల్లీకి న్యాయశాస్త్రంలో మంచి అనుభవం ఉంది. ఇదే సమయంలో గృహహింస, బాలలపై నేరాలు విచారణ విభాగంలో బ్యూరో చీఫ్‌గా కూడా విధులు నిర్వహించారు. న్యూయార్క్‌ కోర్టులో క్లెయిమ్‌ల విభాగంలో న్యాయమూర్తిగా పనిచేశారు. 
 
ఇంకా పలు విభాగాల్లో ఆమె సేవలు అందించారు. 2015లో హైప్రొఫైల్‌ డెమక్రాటిక్‌ సెనెటర్‌ చార్లెస్‌ స్చూమెర్‌ సలహా మేరకు ఎన్‌ డొనెల్లీని నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఫెడరల్‌ జడ్జిగా నియమించారు. ఆమె నియామకాన్ని అప్పటి సెనెట్‌ 95-2ఓట్ల తేడాతో ఆమోదించింది. అప్పట్లో స్చూమెర్‌ ఆమెను నీతివంతురాలు, ఓపెన్‌ మైండెడ్‌ అని అభివర్ణించారు.

వెబ్దునియా పై చదవండి