జెస్సికా లీడ్స్ అనే మహిళా వ్యాపారవేత్త ట్రంప్ నిర్వాకాన్ని తాజాగా బయటపెట్టారు. మూడు దశాబ్దాల క్రితం విమానంలో ట్రంప్, తాను పక్కపక్క సీట్లలో కూర్చొని ప్రయాణించామని... ఆ సందర్భంగా ట్రంప్ తనను అసభ్యంగా తాకారని చెప్పారు.
విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత, తమ మధ్య ఉన్న ఆర్మ్ రెస్ట్‌ని తీసేసి, అసభ్యంగా తాకారని తెలిపారు. తన స్కర్ట్ మీద కూడా చేయి వేశారని చెప్పారు. ట్రంప్ ఒక ఆక్టోపస్ లాంటి వాడని... అతనికి అన్ని చోట్లా చేతులు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ చేష్టలను తట్టుకోలేక సీటు మారిపోయాయని చెప్పారు. అప్పుడు తన వయసు 38 ఏళ్లని జెస్సికా వాపోయింది.