బంగ్లాదేశ్ జర్నలిస్ట్ హత్య.. భర్త నుంచి విడాకుల కోసం..?

బుధవారం, 29 ఆగస్టు 2018 (17:12 IST)
బంగ్లాదేశ్‌లో ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తోంది. తొమ్మిదేళ్ల బాలికకు తల్లి. అయినా భర్త నుంచి విడాకుల కోసం వేచి చూస్తోంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లో ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తున్న మహిళా జర్నలిస్టు సుబర్నా నోడి హత్యకు గురయ్యారు. దుండగులు ఆమెపై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేశారు. 
 
ఆనందా టివి అనే ఓ ప్రైవేటు ఛానల్‌లో ఆమె యాంకర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్‌కు చెందిన జాగ్రోటో పత్రికలో కూడా పని చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో భర్త నుంచి విడాకుల కోసం ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో బైక్‌లపై వచ్చిన 12 మంది దుండగులు ఆమెపై దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. విచారణను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు